ఈనెల 17 నుండి అక్టోబర్ 2వరకు మహిళల కోసం స్వస్థ్ నారీ ససక్తి పరివార్ కార్యక్రమం
ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వస్థ్ నారి ససక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ రెడ్డి చైతన్య నాయుడు తెలిపారు. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా వారు ఎదుర్కొంటున్న వ్యాధులను గుర్తించి వాటి నుండి అధిగమించేందుకు అవసరమైన కార్యక్రమాలను అన్ని పీహెచ్సీ లలో నిర్వహిస్తారన్నారు.