రాయదుర్గం: మడేనహళ్లి గ్రామంలో రచ్చబండ సభ నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా డి. హీరేహల్ మండలంలోని మడేనహళ్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు రచ్చబండ సభ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో బాగంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వైద్య కళాశాలను కొంతమంది వ్యక్తులకు అప్పగించేలా తెచ్చిన జీఓ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 12 న రాయదుర్గంలో జరిగే నిరసన ర్యాలీకి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.