గంగాధర నెల్లూరు: పాలసముద్రం మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
పాలసముద్రం మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎస్ఐ రాజశేఖర్ బుధవారం అరెస్ట్ చేశారు. పాలసముద్రం పంచాయతీలో ఆంధ్రా మద్యం అక్రమంగా అమ్ముతున్నారని సమాచారంతో దాడి చేశారు. మునికృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.