కుప్పం: రైతులను హడలెత్తించిన కొండచిలువ
కుప్పం మండలంలోని నడుమూరు సమీపంలో భారీ కొండచిలువ రైతులను హడలెత్తించింది. సుమారు 9 అడుగులు పొడవైన కొండచిలువ వ్యవసాయ పొలం వద్ద బుసలు కొట్టడంతో వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు పరుగులు తీశారు. అయితే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొండచిలువను పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇటీవల కుప్పం ప్రాంతంలో కొండచిలువలు తరచూ వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యక్షమవుతున్నాయి.