సర్వేపల్లి: మనుబోలు మండలం కేఆర్ పురం లో సర్పాల సయ్యాట, ఆందోళనకు గురైన ప్రజలు
మనుబోలు మండలం కేఆర్ పురం లో రెండు సర్పాలు ఆదివారం పెనవేసుకుని సయ్యాటలాదాయి. ఈ ఘటన స్థానికుల కంటపడడంతో వారు తమ ఫోన్లో ఆ దృశ్యాలు బంధించారు. సుమారు గంటపాటు పాములు అక్కడే ఉన్నాయి. పలువురు రెండు పాములు చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది