పులివెందుల: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేంపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
Pulivendla, YSR | Sep 20, 2025 కడప జిల్లా వేంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత పది రోజులుగా వేతనాలు ఇవిగో అవిగో అంటూ కాలయాపన చేస్తున్నారని చెప్పారు. 5 నెలలుగా పెండింగ్ వేతనాలు, దసరా పండుగ పస్తులేనా? అని ప్రశ్నించారు. కార్మికుల కష్టాలు పడుతుంటే జిల్లా పంచాయతీ అధికారులు స్పందించకపోవడం విడ్డూరం అన్నారు.