శృంగవరపుకోట: పట్టణంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు కాల్చి నిరసన చేసిన సీఐటీయూ నాయకులు
ప్రజలపై విద్యుత్ భారం వేసేది లేదని హామీను ఇచ్చిన కూటమి ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా సోమవారం ఉదయం శృంగవరపు కోటలో సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్తు బిల్లులను భోగిమంటల్లో కాల్చి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ భారాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.