శ్రీకాకుళం: మత్తు పదార్థాల వినియోగం పట్ల అప్రమత్తత అవసరం: మూడవ పట్టణ SI కె జగన్నాథం
శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నారి శక్తి కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా మూడవ పట్టణ ఎస్సైకే జగన్నాథం మాట్లాడుతూ నేడు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతుందని దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు..