పలమనేరు: నెర్నేపల్లిలో మద్యం షాపుల్ని వదలని చోరులు, కన్నం వేసి డబ్బు మద్యం ఎత్తుకెళ్లారు ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు
వీ.కోట: మండలం పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. నేర్నేపల్లి వద్ద ఉన్న ఓ వైన్స్ షాప్‌లోకి గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. గోడను పగలగొట్టి మద్యంతో పాటు నగదును పట్టుకెళ్లినట్లు షాప్ యజమాని తెలిపాడు. సీసీ కెమెరాలు పగలగొట్టి అందులో ఉన్న హార్డ్ డిస్క్ ను సైతం ఎత్తుకెళ్లారని, చోరీ సొత్తు విలువ సుమారు 30 వేల వరకు ఉంటుందన్నాడు. గతంలో కూడా ఈ వైన్‌షాప్‌లో ఇదే తరహా దొంగతనం జరిగినట్లు యజమాని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు.