భూత్పూర్: భూత్పూర్ మండలం కొత్త మొల్గర సమీపంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు వనపర్తి జిల్లా దొంతికుంటతండాకు చెందిన వారిగా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.