యర్రగొండపాలెం: పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఎమ్మార్వో మంజునాథరెడ్డి
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఎమ్మార్వో మంజునాథరెడ్డి ఉప్పల్ పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ లో ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.