ఆర్మూర్: పిప్రి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
ఆర్మూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 13 లక్షల 50 వేల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ గదిని మంగళవారం మధ్యాహ్నం 3:50 ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్మూర్ కు రావాల్సిన వాటాను నిలబడి కొట్లాడి తీసుకు వస్తున్నానని తెలిపారు ఆర్మూర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళను అధికంగా తీసుకువచ్చానని సరిపోయి పక్షంలో పేదల కోసం ఎన్ని వేలనైనా ప్రభుత్వంతో మాట్లాడి మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు.