శ్రీశైల మల్లన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
శ్రీశైల మల్లన్న ను కుటుంబ సమేతంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఆలయ ఈఓ ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే సతీమణి నల్లారి తనూజ రెడ్డి,కుమార్తె వైష్ణవి రెడ్డి, మరియు అల్లుడు తదితరులు ఉన్నారు