స్వర్ణ ఆంధ్ర స్వేచ్చ ఆంధ్ర" కార్యక్రమం ర్యాలీలో పాల్గొన్న చిత్తూర్ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
Chittoor Urban, Chittoor | Oct 18, 2025
మొక్కల పెంపకం ద్వారా స్వచ్ఛమైన గాలి అందుతుందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం, పెంచడం అలవాటుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. అక్టోబర్ నెల మూడవ శనివారం "స్వర్ణ ఆంధ్ర స్వేచ్చ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి ఆరోగ్యవంతమైన జీవనం అంశంపై ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. బీవీ రెడ్డి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.