ప్రొద్దుటూరు: వ్యాధి నిరోధక టీకాలు చిన్నారులకు వరం: డాక్టర్ హనీఫ్ బాబా
Proddatur, YSR | Nov 1, 2025 వ్యాధి నిరోధక టీకాలు చిన్నారులకు వరమని కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హనీఫ్ బాబా తెలిపారు. శనివారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రోటాసిల్ టీకాను పిల్లలకు వేశారు. డాక్టర్ మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలన్నారు. టీకాల ప్రాముఖ్యతను వివరించారు.