తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా, హెలికాప్టర్ సాంకేతిక లోపంతో బహిరంగ సభ రద్దు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పట్టణంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభ వాయిదా పడింది. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెంకు బయల్దేరేందుకు పవన్ హెలికాఫ్టర్ ఎక్కగా టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం దాని తరువాత ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు ఎంతో ప్రయసపడి వచ్చిన జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెపుతున్నామన్నారు. త్వరలోనే మరలా పవన్ కళ్యాణ్ పర్యటించే తేదీ ప్రకటిస్తామన్నారు.