మేడ్చల్: కూకట్పల్లికి చెందిన విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతు
నాగార్జునసాగర్ ఆంజనేయ పుష్కర ఘాటు వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ చూడటానికి వచ్చిన హైదరాబాద్కు కూకట్పల్లికి చెందిన చైతన్య అనే విద్యార్థి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.