పరిగి: నాటికి నేటికి సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది: పరిగిలో అవార్డుల ప్రధానోత్సవం లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గురువులు గురుతర బాధ్యతలను గుర్తించి విలువలతో కూడిన విద్యను అందించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణంలోని ఎస్వీ గార్డెన్ లో పరిగి మండల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటికి నేటికి సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనదని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్