ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపట్నం నుండి ఒంగోలుకు వెళ్ళే ప్రధాన రహదారి అల్లూరు శివారులో రోడ్డు పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు గురువారం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతి చెందిన వ్యక్తిని ప్రైవేటు బస్సు డ్రైవర్ తొట్టెంపూడి కోటేశ్వరరావు గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కొండేపి మండలం మూగచింతల కాగా గత కొంతకాలం నుండి అల్లూరులో నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు