పల్లె రఘునాథ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలి: జెడ్పిటిసి దామోదర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిపరుడని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంగళవారం సాయంత్రం ఓబులదేవరచెరువులోని వైసీపీ నేతలు ఖండించారు. పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మాని, శ్రీధర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమని ZPTC దామోదర్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, 17 నెలల నుంచి ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. మరొక్కసారి శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.