పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైతు భరోసా కేంద్రం వద్ద మొదలైన వివాదం దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో దుర్గంపూడి అంజిరెడ్డి, గాదే హరినాథ్ రెడ్డి గాయపడ్డారు. వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.