మునగపాక మండలం చూచుకొండలో ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్, రూ.87,660 నగదు స్వాధీనం: ఎస్సై పి.ప్రసాదరావు
మునగపాక మండలంలో చూచుకొండ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై పి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 87,660 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.