ఏపీలో రెడ్డి కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయాలి : రెడ్డి సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసి, 2000 కోట్లు నిధులు విడుదల చేసి రెడ్డి విద్యార్థి యువతకు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వినతి పత్రాన్ని డిఆర్ఓ మలోల కి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పార్టీల రామకృష్ణారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి నాయకులు ఫైర్ కృష్ణారెడ్డి సోమిరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.