మనోహరాబాద్: తూప్రాన్ పట్టణంలో భారీ వర్షం, ఉధృతంగా ప్రవహిస్తున్న హల్ది వాగు, తూప్రాన్ కిష్టాపూర్ మధ్య రాకపోకలు బంద్
తూప్రాన్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తూప్రాన్ పట్టణం సోమవారం ఉదయం పూర్తిగా జలమయంగా మారింది. పట్టణ పరిధిలోని గాయత్రీ నగర్ కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీలన్నీ నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నాళాలు కబ్జా కావడంతో ఇళ్ల మధ్య నీరు పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని హల్దీ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కిష్టాపూర్ తూప్రాన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.