మార్కాపురం: సచివాలయ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ఎంపీడీవో వెంకటరామయ్యకు వినతి
ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సచివాలయం సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని ఎంపీడీవో వెంకటరామయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి సర్వేలు అధిక ఒత్తిడి కలిగినా టార్గెట్ల నుంచి సడలింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భరోసా కల్పించాలని వారి కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.