మేడ్చల్: పేట్ బషీరాబాద్ లో బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో అనుమానాస్పస్థితిలో వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ జిల్లా ఘన్ పూర్ కు చెందిన బాబు అనే యువకుడు బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం డ్యూటీకి వెళ్ళిన బాబు ఆదివారం తెల్లవారుజామున వేర్ హౌస్ బాత్రూం వద్ద మృతదేహంగా కనిపించాడు. బాబు తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.