పుల్కల్: మిన్పూర్ గ్రామంలో దుర్గ భవాని నిమజ్జనం భక్తుల కోలాహలం
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని పూల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలో శుక్రవారం దుర్గ భవాని నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వాములు శ్రీమతుల ఆటపాటలతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆటపాటలను సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.