పాణ్యం: ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో ఏపీఐఐసీ భూముల కోసం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి : CiTU జిల్లా నాయకులు గౌస్ దేశాయ్
ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో ఏపీఐఐసీ కోసం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం, పునరావాసం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు గౌస్ దేశాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌ను పలుమార్లు కోరినా స్పందనలేదని విమర్శించారు. నష్టపరిహారం ఇవ్వకపోతే నిర్మాణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.