ఆక్రమణలను వెంటనే తొలగించండి : కమిషనర్ నందన్ ఆదేశం
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మురుగునీరు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణాలను వెంటనే తొలగించాలని కమిషనర్ నందన్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఉదయం కనక మహల్ కూడలి నుంచి ప్రధాన మార్గం వెంబడి డ్రైన్ కాలువల ద్వారా వరద నీటి ప్రవాహం జరుగుతున్న విధానాన్ని పర్యవేక్షించారు. ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం చేపట్టాలన్నారు.