పత్తికొండ: పత్తికొండ పాఠశాలలో వందేమాతరం 150 వసంతాల వేడుక
పత్తికొండ రాజీవ్ నగర్లోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 150 వసంతాల వందేమాతరం సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు నీలకంఠ ఆధ్వర్యంలో భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆలపించి నినదించారు. వందేమాతరం రచయిత బంకిం చంద్ర చటర్జీ జీవిత చరిత్రను ఉపాధ్యాయులు మారుతి విద్యార్థులకు వివరించారు.