ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కవికోకిల, పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి ఉత్సవాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ గ అధ్యక్షతన ఏలూరు తoగేళ్లమూడిలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఆదోని శాసనసభ్యులు పి వి పార్ధసారధి, విశిష్ట అతిధిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, హాజరై ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గుర్రం జాషువా గజీవిత విశేషాలను ముఖ్య వక్త డా //లంక వెంకటేశ్వర్లు తెలియచేసారు.