గోపవరం చెందిన ఓ వ్యక్తి అదృశ్యం :మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Nov 2, 2025
నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన తిరువాయిపాటి భరత్ అదృశ్యమైనట్లు మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భరత్ గత శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వచ్చి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.