కోవెలకుంట్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కోరుతున్న వర్షం ,కండి రైతుల ఆందోళన
నంద్యాల జిల్లా కోవెలకుంట్లతో పాటు ఆయా గ్రామాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంట ప్రస్తుతం పూత దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కంది పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉండగా వర్షం కురుస్తుండటం వల్ల చీడపీడల ఉద్ధృతి పెరిగి పంట నష్టం జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.