ఎక్సైజ్ సురక్ష యాప్ తో ప్రయోజనం ఉందన్న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సురక్ష యాప్ను తెచ్చినట్లు తిరుపతి జిల్లా గూడూరు MLA సునీల్ కుమార్ అన్నారు. శనివారం ఆయన గూడూరు పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్ద సురక్ష యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చని ఆయన తెలియజేశారు.