చౌటుప్పల్: ఉచిత కంటి వైద్య శిబిరాలు సామాన్య ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడతాయి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం చౌటుప్పల్ మండల కేంద్రంలో సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉచిత కంటి వైద్య శిబిరాలు సామాన్య ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.