మార్కాపురం: మెడికల్ కాలేజీ ని పరిశీలించిన సిపిఎం బృందం, త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని ఆదివారం సిపిఎం బృందం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యంత అవసరమని తెలిపారు. వంద రోజుల్లో మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారనిమర్శించారు. ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి దర్శి ప్రాంతాలలోని ప్రజలకు కళాశాల ఎంతో అవసరం అని వెల్లడించారు.