అగ్నికి ఆహుతి అయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
- పెళ్లకూరు మండలం పెన్నేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘటన
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల హైవేపై గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. నాయుడుపేట - పూతలపట్టు మధ్యలో పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామ సమీపన పిఎంకె పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రయాణిస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. నెల్లూరు నుండి బెంగళూరు వెళ్తున్న లక్ష్మీ ట్రావెల్ ఏసీ బస్సు లో ప్రమాదవశాత్తు మంటలు చెల్లరేగాయి. ఈ బస్సులో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులో పొగలు వ్యాపించడంతో మెయిన్ డోర్ లాక్ అయింది. వెంటనే ఎగ్జిట్ డోర్ ద్వారా ప్రయాణికులు బయటకు వచ