ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి ప్రజలు 58 అర్జీలు అందించినట్లుగా ఎస్పీ కార్యాలయం ప్రకటన
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'మీకోసం' కార్యక్రమంలో 58 మంది ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అన్ని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ కార్యాలయం సోమవారం ప్రకటించింది.