కళ్యాణదుర్గం: కంబదూరులోని పురాతనమైన శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీకమాసం పూజలు
కంబదూరు మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ కమలం మల్లేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీకమాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వర స్వామికి అర్చనలు, అభిషేకాలు, హారతులు వంటి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయంలో కార్తీకమాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు చెప్పారు.