నెహ్రూ నగర్ గ్రామంలో విషాదం, ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడి బాలుడు మృతి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లో ఆదివారం తీవ్రవిషాదం చోటుచేసుకుంది, పగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామంలో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా వెనుక చక్రాల కింద పడి చేతన్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు, ఇంటి నిర్మాణం కోసం తెప్పించిన ఇటికలు దించిన తర్వాత ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది, ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు, ఘటన స్థలానికి ముచ్చుమర్రి ఎస్సై చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, బాలుడు మృతి చెందడంతో శోకసముద్రంలో కుటుంబ సభ్యులు