మార్కాపురం: పట్టణంలోని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స తీసుకొని ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని చెక్కులను అందజేశారు. సుమారు 11 మంది బాధితులకు ఐదు లక్షల 51 వేల 567 రూపాయలు అందజేసినట్టు తెలిపారు.