తాడిపత్రి మండల పరిధిలోని పలు చోట్ల శనివారం తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని ఎనిమిది మంది ద్విచక్ర వాహనదారులపై భారీగా జరిమానా విధించారు. ఒక్కొక్కరిపై రూ. 1035 జరిమానా విధించారు. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఏరా అది