చేబ్రోలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి నుంచే జనసేన ఆఫీస్
పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయాన్ని తిరిగి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ నివాసానికి మార్చారు. మొదట్లో పార్టీ కార్యకలాపాలు పవన్ ఇంటి నుంచే జరిగేవి. ఆ తర్వాత పిఠాపురంలో పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు తిరిగి పార్టీ కార్యాలయాన్ని చేబ్రోలులోని పవన్ నివాసానికి మార్చారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మర్రెడ్డి శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు.