పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం ఫిర్యాదులు, కేసు నమోదు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న సంజన సంజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న శారద ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారికి గాయాలు కాగా వారు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి మంగళవారం తెలియజేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకోవడం అని హెచ్చరించారు.