జమ్మలమడుగు: కలసపాడు : దిగువ తంబళ్లపల్లె సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న సగిలేరు
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలంలోని దిగువ తంబళ్లపల్లె సమీపంలో సగిలేరు ఉదృతంగా ప్రవహిస్తున్నట్లు బుధవారం స్థానికులు తెలిపారు. సగిలేరు నదిపై ఉన్న అప్పర్ సగిలేరు ప్రాజెక్టు ఆనకట్టను మంగళవారం రాత్రి నుండి ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అడవులలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో సగిలేరు నది పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని ఆర్డిఓ ఆనకట్ట ను పరిశీలించి రెవిన్యూ అధికారులు మరియు నీటి పారుదల శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులకు ముందస్తుగా తగు సూచనలు చేశారు