నల్గొండ: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాలి: ప్రముఖ కవి రచయిత డాక్టర్ బేల్లి యాదయ్య
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు.ఈ సందర్భంగా కన్వీనర్ డాక్టర్ అక్కేనపల్లి మీనయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాలన్నారు.దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ పోరాట గాథలు ఇతరానికి పాఠ్యాంశాలు కావాలని ఆకాంక్షించారు.