మంత్రాలయం: యాచకులు, గంధపు బొట్టు పెట్టే వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు పెట్టొద్దు: ఎస్సై
మంత్రాలయం:యాచకులు, గంధపు బొట్టు పెట్టే వారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు పెట్టొద్దని ఎస్సై శివాంజల్ సూచించారు. శనివారం యాచకులను, గంధపు బొట్లు పెట్టే వారిని మంత్రాలయం పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, మహిళ కానిస్టేబుల్ నిర్మలమ్మ కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.