పులివెందుల: పాపాగ్ని నదిలోకి భక్తులు ఎవరు దిగకండి : గండి దేవస్థాన పాలకమండలి చైర్మన్ కావలి కృష్ణ తేజ
Pulivendla, YSR | Oct 28, 2025 కడప జిల్లా చక్రాయపేట మండలం లోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థం కు వచ్చే భక్తులు పాపాగ్ని నదిలోకి దిగవద్దని ఆలయ పాలకమండలి ఛైర్మన్ కావలి కృష్ణతేజ సూచించారు. మొంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో నది ఉధృతంగా పారే అవకాశం ఉందని చెప్పారు కనుక భక్తులు ఎవరు పాపాగ్ని నదిలోకి దిగవద్దన్నారు. పాపాఘ్ని నది లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.