పలమనేరు: మండలం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మరియు మాజీ గంగమ్మ గుడి చైర్మన్ నరేష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి రస్తా పొరంబోకులో శాశ్వత నిర్మాణం చేస్తుండడంతో అడ్డుకోవడం వలన పోలీస్ కేసులు కూడా అయ్యాయి ప్రస్తుతం బెయిల్ తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ఉన్నాము ఇప్పుడు మళ్లీ, రస్తా పొరంబోకు జాగాలో ఇంటి నిర్మాణం రాత్రికి రాత్రి చేపట్టాలని సదరు వ్యక్తి పూనుకున్నాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందించామన్నారు.