ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్ విడుదల చేసిన కెవిపిఎస్
దళితులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు తెలిపారు. మంగళవారం నిడదవోలులో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.